తలపు కామారుతత్త్వముమీద నలవడిన నిల నెట్టివారైన నేలాగు గారు
ఓలి నిరువురుసతుల నాలింగనముసేయ లోలుడటుగాన నాలుగుచేతులాయ
వేలసంఖ్యలుసతుల వేడుకల రమియింప బాలుపడెగాన రూపములు పెక్కాయ
పొలయలుక కూటములభోగి దానటుగాన మలసి యొక్కొకవేళ మారుమొగమాయ
లలిత లావణ్య లీలావిగ్రహముగాన కొలదివెట్టగరానిగోళ్ళు నిడుపాయ
చిరభోగసౌఖ్యముల జెంద ననుభవిగాన తిరువేంకటాచలాధీశ్వరుండాయ
పరగ సంసారసంపదకు బద్ధుడుగాన అరుదుగా సకలాంతరాత్మకుడాయ
No comments:
Post a Comment