శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తలపులోపలితలపు

తలపులోపలితలపు దైవమితడు పలుమారు బదియును బదియైనతలపు

సవతైనచదువులు సరుగ దెచ్చినతలపు రవళి దరిగుబ్బలిని రంజిల్లుతలపు
కవగూడి గోరు భూకాంతముంగిటితలపు తివిరి దూషకు గోళ్ళ దెగటార్చుతలపు

 గొడుగువట్టినవాని గోరి యడగినతలపు తడబడక విప్ప్రులకు దానమిడుతలపు
వొడసి జలనిధిని గడగూర్చి తెచ్చినతలపు జడియక హలాయుధము జళిపించుతలపు

వలపించి పురసతులవ్రతము చెరిచినతలపు కలికితనములు చూపగలిగున్నతలపు
యిల వేంకటాద్రిపై నిరవుకొన్నతలపు కలుషహరమై మోక్షగతిచూపుతలపు

No comments:

Post a Comment