తలపోత బాతె తలపులకు దమ కొల దెరంగనిమతి గోడాడగా
ఆపదలు బాతె అందరికిని దమ చాపలపుసంపదలు సడిబెట్టగా
పాపముల బాతె ప్రాణులకును మతి బాపరానియాస దమ్ము బాధించగా
జగడాలు బాతె జనులకును దమ పగలైనకోపాలు పైకొనగా
పగలుబాతె వలలబెట్టెడి తమ్ము దగిలించు మమత వేదనముసేయగా
భయములు బాతె పరులకును తమ దయలేక అలయించుధనముండగా
జయములు బాతె సతతమును యింత నయగారివేంకటనాథు డుండగాను
No comments:
Post a Comment