తలమేల కులమేల తపమే కారణము ఎలమి హరిదాసులు ఏజాతి యైననేమి
పంకములో పుట్టదా పరిమళపు తామెర పొంక కీటములందు పుట్టదా పట్టు
కొంకక శ్రీ వేంకటేశు కొలిచిన దాసులు సంకెలేని జ్ఞానులు లెందు జనియించిరి
కాకము వల్ల పుట్టదా ఘన యశ్వర్థము దాకొని గుల్లలో పుట్టదా ముత్తెము
చౌకైన విషలతనె జనియించదా నిర్విషయము యేకడ మహానుభావు లెందు పుట్టిరేమి
చిడిపి రాళ పుట్టవా చెలువైన వజ్రములు పుడమి నీగల వల పుట్టదా తేనె
వెడగు పిల్లి మేనను వెళ్ళదా జవ్వాది పుడివోని పుణ్యులెందు నుదయించి రేమి
No comments:
Post a Comment