తహతహలిన్నిటికి తానే మూలము గాన సహజాన నూరకున్న సంతతము సుఖము
భారమైపదివేలుపనులు గడించుకొంటే సారెసారె నలయించకపోవు
తీరనియాసోదము దేహములో నించుకొంటే వూరూర దిప్పితిప్పి వొరయకమానవు
వుండివుండి కిందుమీదు వుపమ జింతించుకొంటే వుండుబో మంచముకింద నొకనూయి
కొండంతదొరతనము కోరి మీద వేసుకొంటేనండనే యాబహురూపమాడకపోదు
మనసురానివైన మంచిని చేసుకొంటే తినదిన వేమైన దీపవును
తనిసి శ్రీవేంకటేశు దాసానుదాసుడైతే యెనయుచు నేపనికెదురే లేదు
No comments:
Post a Comment