శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తానె తానే

తానె తానే యిందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞాన యోగి

అపరిమితములైన యజ్ఞాల వడిజేయ బ్రపన్నులకు బుద్ధి వచరించి
తపముగా ఫలత్యాగము సేయించు కపురుల గరిమల కర్మయోగి

అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి
ఉన్నతపదమున కొనరగ గరుణించు పన్నగశయనుడే బ్రహ్మయోగి

తనరగ గపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై
వినరగ సంసార యోగము గృపసేయు అనిమిషగతుల నభ్యాసయోగి

No comments:

Post a Comment