తానెంత బ్రదుకెంత దైవమా నీమాయయెంత మానవుల లంపటాలు మరి చెప్పగలదా
చెలగి నేల బారేటి చీమసయితమును కలసి వూరకే పారుగమ్మర నెందో మరలు
తలమోచి కాపురము ధాన్యములు గూడబెట్టు యిల సంసారము దనకిక నెంతగలదో
యేడో బాయిట బారే యీగ సయితమును వాడుదేర నడవుల వాలి వాలి
కూడపెట్టు దేనెలు గొందుల బిల్లలబెట్టు యేడకేడ సంసారమికనెంతో గలదో
హెచ్చి గిజిగాండ్లు సయితమెంతో గూడువెట్టు తెచ్చి మిణుగురు బురువు దీపము పెట్టు
తచ్చి శ్రీవేంకటేశ నీదాసులు చూచినగుచు రిచ్చలదాని సంసార మికనెంతగలదో
No comments:
Post a Comment