శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తనకేడ చదువులు

తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చంచల బుద్ధి మానీనా

జడ్డు మానవుడు చదువ జదువు నాస వడ్డివారుగాక వదలీనా
గుడ్డికుక్క సంతకుబోయి తిరిగిన దుడ్డు పెట్లే కాక దొరకేనా

దేవదూషకుడై తిరిగేటి వానికి దేవతాంతరము తెలిసీనా
శ్రీవేంకటేశ్వరు సేవాపరుడుగాక పావనమతియై పరగీనా


Download

No comments:

Post a Comment