శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తనకర్మవశం

తనకర్మవశం బించుక దైవకృతం బొకయించుక మనసువికారం బించుక మానదు ప్రాణులకు

ఈదైన్యము లీహైన్యము లీచిత్తవికారంబులు యీదురవస్థలు గతులును యీలంపటములును
యీదాహము లీదేహము లీయనుబంధంబులు మరి యీదేహముగలకాలము యెడయవు ప్రాణులకు

యీచూపులు యీతీపులు నీనగవులు నీతగవులు నీచొక్కులు నీసొక్కులు నీవెడయలుకలును
యీచెలుములు నీబలువులు నీచనువులు నీఘనతలు నీచిత్తముగలకాలము యెడయవు ప్రాణులకు

యీవెరవులు నీయెరుకవులు యీతలపులు నీతెలుపులు దైవశిఖామణితిరుమల దేవునిమన్ననలు
దైవికమున కిటువగవక తనతల పగ్గలమైనను దైవము తానౌ తానే దైవంబవుగాన

No comments:

Post a Comment