తనకర్మమెంత చేతయు నంతే గొనకొన్న పని యంత కూలే నంతే
తలపులో హరి నెంత దలచె నేడే వాని కలిమియు సుఖమును గలదంతే
తలదూచ బైడెంత తూకము నంతే నెలకొన్నపిండెంత నిప్పటీ నంతే
సిరివరుపూజెంత సేసె నేడే వాని దరియును దాపు నెంతయు నంతే
పురిగొన్న యీవెంత పొగడూ నంతే నరపతిచనవెంత నగవూ నంతే
శ్రీ వేంకటపతి చింత యంత నేడే భావపరవశము పలుకూ నంతే
దైవము కృప యంత తానూ నంతే యేవంక జయమెంత యిరవూ నంతే
No comments:
Post a Comment