తన మేలెచూచు గాక తరుణుల యెడలను యెనలేని మగవాని నేమనగ వచ్చును
మంత నాన నాకె నీవు మాటలాడే చోటికి వింతది రా సిగ్గుగాదా విచారించితే
చెంత నీ వెదెర గక చెలి నిందుకు బిల్చేవు యెంతైనా మగవాని కెక్కడిది తగవు
గారవాన నాకె నీవు కాగిలించ కుండ గాను మారు సతితో తొంగిచూడ గోరము గాదా
ఆరీతి వాకిట నుంటే ఆపె దెమ్మనేవు వీడె మారజవు మగవాడు ఆదికెకు లోగునా
శ్రీవేంకటేశుడ ఆకె చెయి పట్టి పెండ్లాడగా సేవ సేయ నొకతెకు సెగ్గెము గాదా
యీ వల నన్నేలితివి యీపె నాపె గూడితివి కావరపు మగవాని కతలిట్టే కాదా
No comments:
Post a Comment