కంటి శుక్రవారము గడియ లేడింట అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని
సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి తుమ్మెద యైచాయతోన నెమ్మది నుండే స్వామిని
పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై నిచ్చమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని
తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది బిట్టు వేడుక మరియు చుండే బిత్తరి స్వామిని
Download
No comments:
Post a Comment