శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 6, 2010

కంటి నిదే

కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి నంటున నిందుకంటెను నాణె మెందూ లేదు

మేటివైరాగ్యముకంటే మిక్కిలి లాభము లేదు గాటపువిజ్ఞానముకంటే సుఖము లేదు
మీటైనగురువుకంటే మీద రక్షకుడు లేడు బాటసంసారముకంటే పగ లేదు

పరపీడసేయుకంటే పాపము మరెందు లేదు పరోపకారముకంటే బహుపుణ్యము లేదు
నిరతశాంతముకంటే నిజధర్మ మెందు లేదు హరిదాసుడౌకంటే నట గతి లేదు

కర్మసంగము మానుకంటే దేజము లేదు అర్మిలి గోరికమానేయంతకంటే బుద్ధి లేదు
ధర్మపు శ్రీవేంకటేశు దగిలి శరణుజొచ్చి నిర్మలాస నుండుకంటే నిశ్చయము లేదు

No comments:

Post a Comment