కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి
మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి రహి వహించిన గోపురములవె కంటి
పావనంబైన పాపవినాశము గంటి కైవశంబగు గగన గంగ గంటి
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి కోవిదులు గొనియాడు కోనేరి గంటి
పరమ యోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల గంటి
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి తిరు వేంకటాచలాధిపు జూడగంటి
No comments:
Post a Comment