శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 6, 2010

కంచూగాదు

కంచూగాదు పెంచూగాదు కడుబెలుచు మనసు యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు

పట్ట బసలేదు చూడ బయలుగా దీమనసు నెట్టన బారుచునుండు నీరుగా దీమనసు
చుట్టి చుట్టి పాయకుండు జుటమూగా దీమనసు యెట్టనెదుటనే వుండు నేటిదో యీమనసు

రుచులెల్లా గానుపించు రూపు లేదు మనసు పచరించు నాసలెల్లా బసిడిగా దీమనసు
యెచటా గరగదు రాయీగాదు మనసు యిచటా నచటా దానే యేటిదో యీమనసు

తప్పక నాలో నుండు దైవము గాదు మనసు కప్పి మూటగట్టరాదు గాలీ గాదు మనసు
చెప్పరానిమహిమలశ్రీవేంకటేశు దలచి యిప్పుడిన్నిటా గెలిచె నేటిదో యీమనసు

No comments:

Post a Comment