నిముషమెడతెగక హరి నిన్ను తలచి మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక
నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి
కదిసి కోరినను గతకాలంబు వచ్చునే మది మదినె యుండి ఏమరక బతుకుట గాక
కడు తనయులకు కొంత కాంతలకు నొక కొంత వెడయాసలకు కొంత వెట్టిసేసి
అడరి కావలెననిన అందు సుఖమున్నదా చెడక నీ సేవలే సేసి బతుకుటగాక
ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి తనవారి తగిలి కాతరుడైనను
కను కలిగి శ్రీ వేంకటనాథ కాతువే కొనసాగి నిన్నునే కొలిచి బతుకుటగాక
No comments:
Post a Comment