శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 27, 2010

నిలు నిలు దగ్గరకు

నిలు నిలు దగ్గరకు నీయాన నీకు వలచితినని మావారెల్లనగరా

వద్దు వద్దు కొండలలో వారికి మాకింతేసి పెద్ద పెద్ద ముత్యాల పేరులిన్నేసి
అద్దము చూచిదె మాకు నంతకంటె సిగ్గయ్యీని గద్దరి మాచెంచువారుగని నన్ను నగరా

చాలు జాలు బంగారు సరుపణులుంగరాలు నీలపుగంటసరులు నీకే ఉండనీ
మూలనుండే వారుగాక ముత్యాలచెరగుల చేలంగట్టు కొన్న నన్ను చెంచెతలు నగరా

No comments:

Post a Comment