నీవుదేవుడవు నేనొకజీవుడ ఈవిధి నిద్దరి కెంత అంతరువు
పొడమిన జగములు పుట్టెడి జగములు గుడిగొనె మీరోమ కూపములు
యెడయక నీరూప మేమని ధ్యానింతు అడరి మీవాడ ననుటే గాక
మునుపతి బ్రహ్మలు ముందరి బ్రహ్మలు మొనసి మీ నాభిని మొలచేరు
ఘనుడవు నిన్నే గతి నే దెలిసెద అనువుగ మిముశరణనుటే గాక
సహజానందము సంసారానందము ఇహము పరముగా నిచ్చేవు
అహిపతి శ్రీవేంకటాధిప నీ కృప మహిలో సేవించి మనుటే గాక
No comments:
Post a Comment