నీవనగ నొకచోట నిలిచివుండుటలేదు నీవనుచు గనుగొన్ననిజమెల్ల నీవే
తనయాత్మవలెనె భూతములయాతుమలెల్ల ననయంబు గనుగొన్నయతడే నీవు
తనుగన్నతల్లిగా తగనితరకాంతలను అనఘుడై మదిజూచునతడే నీవు
సతతసత్య వ్రతాచార సంపన్నుడై అతిశయంబుగ మెలగునతడే నీవు
ధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు హతకాముకుడైన యతడే నీవు
మోదమున సుకదుఃఖములు నొక్కరీతిగా నాదరింపుచున్నయతడే నీవు
వేదోక్తమతియైన వేంకటాచలనాథ ఆదియును నంత్యంబు నంతయును నీవే
No comments:
Post a Comment