శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 27, 2010

నీరువట్టు గొన్నవేళ

నీరువట్టు గొన్నవేళ నేయి మందదవునా కూరిమి మమ్మిద్దరిని గూరుచరే చెలులు

నెలత చెక్కులే నాకు నిలువుటద్దములు అలరుల తావి వూర్పులాల వట్టాలు
సెఅవుల నగవులే చేతికిచ్చే కప్పుఆలు చలిమందు లిక నన్నీ జాలునే నాకు

వనిత మాటలే నాకు వలరాచ మంత్రాలు నినుపు జెమటలే పన్నీటి సోనలు
ఘనమైన సరశాలే గందపు కస్తూరి పూత యెనలేని వుపచారా లివియేలే నాకు

సతితోడి పానుపే చంద్రకాంతపు వేది యితవుగ గూడించితి రిందరూ మమ్ము
రతుల శ్రీ వేంకటాద్రి రాయడ నేనది వో మితిమీర నూచకురే మేలాయ బనులు

No comments:

Post a Comment