శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 27, 2010

నీయాధీనము

నీయాధీనము లింతే నిఖిలప్రపంచమును మాయాకృతము నీవు మానుమంటే మానదా

నీకు నరుహంబైన నిండినయీమనసు కాకువిషయాలపాలుగా నరుహమా
చేకొని నీవు పెరరేచినయీచైతన్యము పైకొని అకర్మములపాలు సేయదగునా

అంచల నీవంతర్యామివైనయీదేహము పంచేంద్రియముల కొప్పనసేతురా
యెంచగ నీకుక్షిలోన నెత్తిన యీజన్మము కొంచెపుభోగములకు గురిసేయవలెనా

శ్రీవేంకటేశ నీకు జక్కినయీదాస్యము యీవల సంసారమున కియ్యవలెనా
దేవుడవు నీవేయని తెలిస్పితి విదే మాకు జీవులము మమ్ము నిక చిమ్మిరేచనేటికి

No comments:

Post a Comment