నీయాజ్ఞ దలమోచి నీదేహధారి నైతి యీయెడ గోవిందుడ నే నీడేరేదెట్లో
తనువు వేసరినాను తలపు వేసరదు ధనము గడించెడితరితీపున
చెనకి మగడు విడిచిన మామ విడువని పనియాయ హరి నాబదుకుజాడ యెట్లో
పాయము ముదుసినాను భావము ముదియదు వేయైన సంసార విషయాలను
వోయయ్య కలివోసినావెట్లదిక్కు చూచేది మాయదాయ నిక నామనసుజాడెట్లో
కడలేని నావిధులు కన్నులార జూచి నీవు నడుమ శ్రీవేంకటేశ నన్ను నేలితి
నొడుగులు దప్పినాను నోముఫలము దప్పని అడియాలమబ్బె నాకు నానతిచ్చితెట్లో
No comments:
Post a Comment