శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తుదిలేని బంధము

తుదిలేని బంధము తోడునీడై నేను వదలినా వదలదేమి సేతు

గులిమికొలుచు దీరగుడువనియ్యక కొత్త కొలుచు మీదమీద గొలువగా
కలసినకర్మపు గలిమిచేత దృష్ణ వెలితిగాక యిల్లువెడల దేమిసేతు

అన్నియు నొకమాటే యనుభవింపగ జేసి కొన్నివెచ్చము లొనగూడించి
యిన్నిటా దిరువేంకటేశ నిర్మలునిగా నన్నుజేసి నీవు నాకు గలుగవయ్య

No comments:

Post a Comment