శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 21, 2010

ధృవవరదా

ధృవవరదా సంస్తుతవరదా నవమైనయార్తుని నన్ను గావవే

కరిరాజవరదా కాకాసురవరదా శరణాగతవిభీష్ణవరదా
సిరుల వేదాలు నిన్ను జెప్పగా వినీని మరిగి మఱుగుచొచ్చే మమ్ము గావవే

అక్రూరవరదా అంబరీషవరదా శక్రాదిదివిజనిచయవరదా
విక్రమించి యిన్నిటా నీవే ఘనమని నీకు చక్రధర శరణంటి సరి గావవే

ద్రౌపదీవరదా తగ నర్జునవరదా శ్రీపతీ ప్రహ్లాదిశిశువరదా
యేపున శ్రీవేంకటాద్రి నిటు నేను నాగురుడు రూపగా గొలిచే నచ్చుగ గావవే

No comments:

Post a Comment