శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 14, 2010

దృష్టితాకు మాఅయ్యకు

దృష్టితాకు మాఅయ్యకు తెరవేయరే దృష్టించెదరెవరైనా దరిచేరనీయకురే

చప్పుడు సేయుటకవసరము కాదనరే అప్పుడు మజ్జనము ఆడుననీ తెలుపరే
కప్పురంపు సురటుల కొలిచెదరనరే అప్పుడు సతుల తోనూ ఆరగించినాడనరే

దంతపు చవికెలో ఏకాంతమాదేననరే అంతరంగమున నృత్యము ఆడెదరని తెలుపరే
దొంతి పూలతోటలోన తమిగూడి యున్నాడనరే చెంత కేళాకూళి లోన చిత్తగించి యున్నాడనరే

పట్టంపు రాణియు తాను పవ్వళించియున్నాడనరే రట్టుసేయనిందెవరైనా రానీయకురే
పట్టపు అలమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుడు సృష్టిలోకకర్త గాన సేవించి పొమ్మనరే

No comments:

Post a Comment