శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 14, 2010

దురితదేహులే

దురితదేహులే తొల్లియును శ్రీహరి భజించి నిత్యాధికులైరి

అనంతకోటి మహామునులు ఈ సనకాదులు నిశ్చలయశులు
ఇనశశినయనుని నితనిని మునుగని భజించి గతకల్మషులైరి

అతిశయమతులు మహామహులు సుఖ రతివిముఖులును చిరంతనులు
హితవిచారమతి నితనిని సతతమును భజించి ధన్యులైరి

దేవతాధిపులు దివ్యులును కడు బావనులును తగ బరహితులు
యీవేంకటపతి నితనిని సేవించి సుఖాంచితమతులైరి

No comments:

Post a Comment