శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 27, 2010

నీమహత్త్వంబు

నీమహత్త్వంబు లోనికి వెలుపలికి గప్పి కామింప నిట్టిదని కానారా దటుగాన

నిండి యిన్నిటిలోన నీవు గలవని భ్రాంతి నుండుదువుగాని నీ వొకటియును గావు
దండిగలగిరి ప్రతిధ్వని దోచుగాని యది కొండలోపల లేదు కొండయును గాదు

బలసి యిన్నిటిలోపలను జైతన్యమై మెలగుదువుగాని యేమిట నీవు లేవు
పలుదెరగులైన దర్పణమునం దొకనీడ వొలయుగాకందు దలపోయ నదిలేదు

వుడుగకన్నిటిలోన నుండుటయు లేదు నీ వుడివోయి యందుండకుండుటయు లేదు
చెడనితేజముగాన శ్రీవేంకటేశ నీ పొడవు పరిపూర్ణమై పొలుపొందు

No comments:

Post a Comment