నీపాపమే కాదు ఇది నిండిన లోకము జాడ పైపై వచ్చిన వలపు పాటించరెవ్వరును
అట్టే మంచిమాటలాడే అతివ బాతి పడగ చిట్టకములాడే యింతిజెనకేవు
అట్టే కాదా పంచదార అండనెంత వుండినాను పట్టి పెనగేటి నిమ్మపంటికి నోరూరును
చేతులెత్తి మొక్కేటి చెలి గాచుకుండగాను ఆతలిమోమైన వారి కాసపడేవు
జాతితో బాలపండ్లు సంగడినే వుండగాను ఘాత బెరిగే బూరుగు గాయలు చూపట్టును
నెట్టన బెండ్లాడిన నేనే నీ కుండగాను ఱట్టు గొల్లెతలచే నాఱడి బొందితి
ఇట్టేనిన్ను గూడితిని యిందాకా శ్రీ వేంకటేశ వొట్టితే పాలును జల్లా నొక్కరీతి నుండును
No comments:
Post a Comment