శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 27, 2010

నీదాస్యమొక్కటే

నీదాస్యమొక్కటే నిలిచి నమ్మగలది శ్రీదేవుడవు నీచిత్తము నాభాగ్యము

అనుష్ఠానములు గతియని నమ్మి చేసితినా తనువిది మలమూత్రములప్రోగు
జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా వొనర గర్మమనేవోదాన బడినది

చదువుల శాస్త్రములజాడలు నమ్మితినా పొదలినమతములపోరాట మది
మదిమదినుండిననామనకే నమ్మితినా అదియును నింద్రియాల కమ్ముడువోయినది

పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా పాత్రమగురుణానుబంధములవి
చిత్రముగ నను గావు శ్రీవేంకటేశ నీవే పత్రపుష్పమాత్రమే నా భక్తియెల్లా నీకు

No comments:

Post a Comment