శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 27, 2010

నీదాసుల భంగములు

నీదాసుల భంగములు నీవుజూతురా ఏదని జూచేవు నీకు నెచ్చరించవలెనా

పాల సముద్రము మీద పవ్వళించ్చినట్టి నీకు బేలలై సురలు మొరవెట్టిన యట్టు
వేళతో మామనువులు విన్నవించితిమి నీకు ఏల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాద

ద్వారకా నగరములో తగ నెత్తమాడే నీకు బిరాన ద్రౌపది మొరవెట్టిన యట్టు
ఘోరపు రాజసభల కుంది విన్నవించితిమి ఏరీతి పరాకు నీకు నింక రక్షించరాద

ఎనసి వైకుంఠములో నిందిర గూడున్న నీకు పెనగి గజము మొరవెట్టిన యట్టు
చనువుతో మాకోరికె సారె విన్నవించితిమి విని శ్రీవేంకటేశుండ వేగ రక్షించరాద

No comments:

Post a Comment