శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 27, 2010

నీకేల భయము

నీకేల భయము నీకునీకే యులికేవు చేకొన్న నీచేతలందు జెరిగున్నావా

చనువు సేసుక ఆపె సారె నీమోము చూచితే చెనక జాలక యేల సిగ్గుపడేవు
కనుగొనబోతే నందు కళలింతే వుండేనవి వెనుకొని కాంతలెల్లా వేలుకాడేరా

మచ్చిక చేసుక ఆపెమాటలు నిన్నాడించితే కొచ్చికొచ్చి నీవేల కొంక జూచేవు
కచ్చుపెట్టి తోచేవి కల్లనిజములేకాక అచ్చమై పొందిన సతులంటుకున్నారా

చుట్టముసేసుక యింతి సొరిది నిన్నుగూడితే యిట్టె శ్రీ వేంకటేశ నీవేల మొక్కేవు
గుట్టునను కొనగోళ్ళ గురుతులుండీ గాక ముట్టిన కాంతలు మేన మూగుకున్నారా

No comments:

Post a Comment