నీకేమయ్య నీకు నీవే దొడ్డవాడవు చేకొని చెట్టడిచితే చేటడేసి వాపులు
తలపోత లొక్కటైతే తమకమినుమడాయ నిలువుకు నీవే బేరము
కొలిచినందే కొలిచి గోపికల్ల కెల్లాను వలప్వ దీసితిగా వలపులనీవు
నగవులు మానెడైతే నునుపులడ్డె డేశాయ నిగిడే నన్నిచోట్లా నీ బేరము
అగడుగా నాగిచ్చి అంగనల కెల్లాను జిగి వడ్డికొంటివి సిగ్గులెల్లా నీవు
మోవితేనగ్గువలైతే ముదములు లాభమాయ నీవు నన్ను గూడినదే నీ బేరము
భావించి శ్రీ వేంకటేశ పడతుల కెల్లాను వావాత నమ్మితివిగా వయసులు నీవు
No comments:
Post a Comment