నీకథామృతము నిరతసేవన నాకు చేకొనుట సకల సంసేవనంబటుగాన
ఇదియే మంత్రరాజము నాకు నే ప్రొద్దు ఇదియే వేద సంహిత పాఠము
ఇదియె బహుశాస్త్ర మెల్ల చదువుటనాకు ఇదియె సంధ్య నాకిదియె జపమటుగాన
ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు ఇదియె దుఃఖవిరహిత మార్గము
ఇదియె భవ రోగరహిత భేషజమునాకు ఇదియె ఉపనిషద్వ్యాక్య పద్ధతి
ఇదియె దాన ఫలమీ జాలినది నాకు ఇదియె తలప పరహిత మార్గము
ఇదియె తిరువేంకటేశ నీసంస్మరణ మిదియె ఇదియె యిన్నియును నటుగాన
No comments:
Post a Comment