శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 27, 2010

నీ వేలికవు

నీ వేలికవు మాకు నీదాసులము నేము ఆవల నితరుల నే మడుగబొయ్యేమా

పసురమై వుండి యిచ్చీ బక్కన గామధేనువు యెసగి మానైవుండి యిచ్చీ గల్పవృక్షము
వెస రాయైవుండి యిచ్చీ వేడుక చింతామణి మసలనిశ్రీపతివి మాకు నిచ్చే టరుదా

గాలి యావటించి యిచ్చీ గారుమేఘము మింట వీలి జీర్ణమై యిచ్చీ విక్రమార్కునిబొంత
కాలినపెంచై వుండి కప్పెర దివ్యాన్నమిచ్చీ మైలలేనిశ్రీపతివి మాకు నిచ్చే దరుదా

అండనే కామధేనువ వాశ్రితచింతామణివి పండినకల్పకమవు భక్తులకెల్లా
నిండిన శ్రీవేంకటేశ నీవు మమ్ము నేలితివి దండిగా నమ్మితే నీవు దయజూచు టరుదా

No comments:

Post a Comment