శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 27, 2010

నీ విభుడు

నీ విభుడు వచ్చు దాక నిచ్చ్లాన నుండ వే వేవేలకును రేయి వేగించవేమే

పూయకు కస్తూరి మేన బొద్దుగూకె జీకటంటా నోయమ్మ చందురుడుదయించెను
చాయల వెన్నెలదాకి చల్లజంపు యెండలంటా ఆ యెడ నీవు వేగగ నది చూడ్లేమే

గందము పుయ్యకువే కలికి నీ కుచములే చందనపు గొండలంటా జల్లీగాలి
అందులో పూవు తావిదాకి అమ్ము మొనలంటెనంటా మందమై మేను మరువగ మందులు దేలేమే

వద్దేలే కుంకుమలు వనంతపు జిగురంటా నద్దితే గోవిల భూతమని లోగేవు
నిద్దపు శ్రీ వేంకతాద్రి నిలయుడిత్తె కూదె యిద్దరి మీ వలపులు యింకనెంచలేమే

No comments:

Post a Comment