శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తిరువీధుల మెరసీ

తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను

తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు సిరుల రెండవనాడు శేషుని మీద
మురిపాల మూడవనాడు ముత్యాల పందిరిక్రింద పొరినాలుగవనాడు పువ్వు గోవిలలోను

గ్రక్కున నైదవనాడు గరుడునిమీద యెక్కెను నారవనాడు యేనుగుమీద
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను యిక్కువ దేరును గుర్రమెనిమిదవనాడు

కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట
యెనసి శ్రీవేంకటేశు డింతి యలమేల్మంగతో వనితల నడుమను వాహనాలమీదను


Download

No comments:

Post a Comment