తిరువీధు లేగీని దేవతలు జయవెట్ట హరి వాడె పెండ్లికొడుకై ప్రతాపమున
కనకపుగొండవంటిఘనమైనరథముపై దనుజమర్దనుడెక్కె దరుణులతో
వినువీధి బడెగెలు వేవేలు కుచ్చులతోడ బెనగొనగ గదలె భేరులు మ్రోయగను
వరుస జంద్రసూర్యులవంటిబండికండ్లతోడ గరుడధ్వజు డొరసీ గడు దిక్కులు
విరుగువేదరాసులే పగ్గాలు వట్టితియ్యగ సరుగ దుష్టుల గొట్టి జయము చేకొనెను
ఆటలు బాటలు వింటా నలమేల్మంగయు దాను యీటున శ్రీవేంకటేశు డెదురులేక
వాటపుసింగారముతో వాకిటవచ్చి నిలిచీ కోటానగోటివరాలు కొమ్మని ఇచ్చుచును
No comments:
Post a Comment