తెలియక వూరక తిరిగేము చలమరి కగునా సంతతసుఖము
హేయము కడుపున నిడుకొని యింకా చీ యనినమాకు సిగ్గేది
పాయము పిడికిట బట్టుచునుండేటి కాయధారులకు గలదా విరతి
అంగనలరతులయాసలనీదేటి యెంగిలిమనుజుల కెగ్గేది
ముంగిట నార్గురుముచ్చులగూడిన దొంగగురుని కిందుల నిజమేది
జననమరణములు సరిగని కానని మనుజాధమునకు మహిమేది
యెనగొని శ్రీవేంకటేశు శరణమిటు గని మనకుండిన గతి యిక నేది
No comments:
Post a Comment