శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తెలియదెవ్వరికిని

తెలియదెవ్వరికిని దేవ దేవేశ యీ నెలత భావంబెల్ల నీవెఱుగు దికనూ

నిలుచు దలయూచు గన్నీరు వాలిక గోళ్ళ జినుకు నివ్వెఱగుపడు జింతించును
పులకించు నలయు దలపోయు నిను జిత్తమున నిలుపు నంగన విధము నీ వెఱుగు దికను

కమలంబు చెక్కుతో గదియించు నెన్నుదుట చెమట బయ్యెద దుడుచు సెలవి నగును
తమకంపు గోరికలు తరుణి యిదె నిను బాసి నిమిష మోర్వగలేదు నీవెఱుగు దికను

వెక్కసపు నును దురుము వెడవ దలనేరదు చిక్కుదేరగ గొంత సిగ్గు వడును
ఇక్కువల దిరువేంకటేశ నిను గూడె నిదె నిక్క మీచెలి వగల నీ వెఱుగ దికనూ

No comments:

Post a Comment