తరుణి మేనికిని నీ తనువె మాటు నిరుతపుటాసకు నిండు జూపె మాటు
చెలియ సిగ్గులకు చెక్కు చేయే మాటు పలుకులకును మోవి పండే మాటు
నెలకొన్న చింతలకు నివ్వెరగే మాటు బలు జవ్వనమునకును పయ్యెదే మాటు
ముంచిన నవ్వులకును మొక్కులివే మాటు మంచి నడపులకు మట్టెలే మాటు
వంచిన శిరస్సునకు వాలుగొప్పే మాటు కొంచని చనులకు కొనగోరే మాటు
పొందుల రతులకును పుక్కిటి విడెమే మాటు అందిన వేడుకకౌ నాయములె మాటు
విందుల రతులకు వేవేలు వలపులె మాటు యిందుముఖికై శ్రీ వేంకటేశ నీ యింపె మాటు
No comments:
Post a Comment