తప్పించుకొనరానిదిక దైవమేగతి యెపుడు నుద్ధరించే వారెవ్వరునులేరు
మలసి దేహానందమే మరిగిన యాత్మకు తొలుత బ్రహ్మానందము దొరకదు
అలవాటై క్షుద్రభోగాలందు జిక్కినయాత్మకు బలిమి విరతి బొంద బలపడదు
సర్వదా బ్రహ్మాండములో జరియించే యాత్మకు నిర్వహించి వెడలగనేరుపు లేదు
వుర్విలోపల చింతలుడగని యాత్మకు నిర్వికారభారము నెలకొనదు
విరస వర్తనలనే వెలసేటియాత్మకు మరగ బెద్దలమీది భక్తిపుట్టదు
ధరలో ఆ వేంకటేశుదాసుడు గాని యాత్మకు వెరపేమిటాలేదు వెదకి చూచినను
No comments:
Post a Comment