శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తప్పదోయవే

తప్పదోయవే దైవశిఖామణీ యిప్పుడు నీకృప నెనసితి నేను

అనలము బొడగని యటునిటు మిడుతలు కినిసి యందు మగ్గినయట్లు
అనువగువిజ్ఞాన మాత్మ వెలుగగ మొనసి యింద్రియములు మూగీ నాకు

అఱిమురి గమలము లటు వికసించిన మెఱసి తుమ్మిదలు మించుగతి
తఱి నాహృదయము తగవికసించిన తఱమీ నజ్ఞానతమ మది నాకు

యీరీతి శ్రీ వేంకటేశ్వర యిన్నియు నూరకే యుండగా నొదిగియుండె
నేరిచి నీభక్తి నిలుపగ మదిలో చేర గతిలేక చిమిడీ నదివో

No comments:

Post a Comment