తప్పదు తప్పదు దైవముకృప యిది ముప్పిరి నింతా ముకుందుడే
వెక్కసపుమతి వెలుతులుదీరిన నెక్కడ చూచిన నీశ్వరుడే
గుక్కక యాసలు గోసివేసినను నిక్కమడుగడుగు నిధానమే
పొంచి శరీరపుభోగము లుడిగిన చుంచుబాపములు సుకృతములే
దంచెడి విషయపు తగులము బాసిన యెంచిచూచినను యిహమే పరము
శ్రీవేంకటపతి సేవే కలిగిన వేవేలువగలు వేడుకలే
చేవదీరె సందియము లేదిదే భావమునమ్మిన ప్రపన్నులకు
No comments:
Post a Comment