శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 21, 2010

నటనల భ్రమయకు

నటనల భ్రమయకు నా మనసా ఘటియించు హరియే కలవాడు

ముంచిన జగమిది మోహినీ గజము పొంచిన యాస పుట్టించేది
వంచనల నిజమువలెనే వుండును మంచులు మాయలె మరునాడు

సరి సంసారము సంతలకూటమి సొరిది బజారము చూపేది
గరిమ నెప్పుడు గలకల మనుచుండును మరులగు విధమే మాపటికి

కందువ దేహముగాని ముదియదిది అందిన బహు రూప మాడేదిది
యెందును శ్రీ వేంకటేశ్వరుండును డిందు పడగనిదె తెరమరుగు

No comments:

Post a Comment