శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 21, 2010

నగుబాట్లబడేనాజిహ్వా

నగుబాట్లబడేనాజిహ్వా పగటున నిదివో పావనమాయ

ఇల నిందరి నుతియించి పెంచువలె నలినలియైనది నాజిహ్వా
నలినోదరుశ్రీనామము దలచిన ఫలమున కిదివో పావనమాయ

భ్రమపడి మాయపుపడతులతమ్మలు నమలి చవులుగొనె నాజిహ్వా
అమరవంద్యుడగుహరి నుతియించగ ప్రమదము చవిగొని పావనమాయ

నెలతలయోనిద్రవనదులను నలుగడ నీదెను నాజిహ్వా
అలసి వేంకటనగాధిపయనుచును పలికినయంతనె పావనమాయ

No comments:

Post a Comment