శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 21, 2010

నగు మొగము

నగు మొగము తోడి వో నరకేసరి నగ రూప గరుడాద్రి నరకేసరి

అమిత దానవ హరణ ఆదినరకేసరి అమిత బ్రహ్మాది సుర నరకేసరి
కమలాగ్ర వామాంక కనక నరకేసరి నమో నమో పరమేశ నరకేసరి

రవిచంద్ర శిఖ నేత్ర రౌద్ర నర కేసరి నవ నారసింహ నమో నర కేసరి
భవనాశినీ తీర భవ్య నర కేసరి నవరసాలంకార నర కేసరి

శరణాగత త్రాణ సౌమ్య నరకేసరి నరక మోచన నామ నరకేసరి
హరి నమో శ్రీ వేంకటాద్రి నరకేసరి నరసింహ జయ జయతు నరకేసరి

No comments:

Post a Comment