నగవులు నిజమని నమ్మేదా వొగినడియాసలు వొద్దనవే
తొల్లిటి కర్మము దొంతల నుండగ చెల్లబోయిక జేసేదా
యెల్ల లోకములు యేలేటి దేవుడ వొల్ల నొల్లనిక నొద్దనవే
పోయిన జన్మము పొరుగులనుండగ చీయనక యిందు జెలగేదా
వేయినామముల వెన్నుడమాయలు ఓ యయ్య యింక నొద్దనవే
నలి నీనామము నాలికనుండగ తలకొని యితరము దడవేదా
బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి వొలుకు చంచలము లొద్దనవే
Download
No comments:
Post a Comment