నగధర నందగోప నరసింహ వోనగజవరద శ్రీ నారసింహ
నరసింహ పరంజ్యోతి నరసింహా వీరనరసింహ లక్ష్మీనారసింహా
నరసుఖ బహుముఖ నారసింహా వోనరకాంతక జేజే నారసింహా
నమో నమో పుణ్డరీక నారసింహ వోనమిత సురాసుర నారసింహా
నమకచమకహిత నారసింహా వోనముచిసూదన వంద్య నారసింహా
నవరసాలంకార నారసింహా వోనవనీతచోర శ్రీ నారసింహా
నవగుణ వేంకట నారసింహా వోనవమూర్తి మండెము నారసింహా
No comments:
Post a Comment