శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 21, 2010

నందకధర నంద

నందకధర నంద గోపనందన కందర్ప జనక కరుణాత్మన్

ముకుంద కేశవ మురహర సకలాధిప పరమేశ్వర దేవేశ
శుకవరద సవితృ సుధాంశు లోచన ప్రకట విభవ నమో పరమాత్మన్

ధృవపాంచాలీ స్తుతివత్సల మాధవ మధుసూదన ధరణీధరా
భువనత్రయ పరిపోషణ తత్పర నవనీతప్రియ నాదాత్మన్

శ్రీమాన్ వేంకట శిఖిరనివాస మహామహిమాన్ నిఖిలాణ్డపతే
కామిత ఫల భోగప్రదతే నమో స్వామిన్ భూమన్ సర్వాత్మన్

No comments:

Post a Comment