శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 14, 2010

దేవ దేవొత్తమ

దేవ దేవొత్తమ తే నమోనమో రావణ దమన శ్రీ రఘురామా

రవికులాంబుధి సోమ రామలక్ష్మనాగ్రజ భువి భరతశత్రుఘ్న పూర్వజ
సవన పాలక కౌసల్యానంద వర్ధన ధవలాబ్జ నయనా సీతా రామా

దనుజ సమ్హారక దశరథ నందన జనక భుపాలక జామాత
వినమిత సుగ్రీవ విభిషణ సమేత ముని జన విముఖ సుముఖ సుచరిత్ర

అనిలజ వరద అహల్య శాపమోచన సనకాది సేవిత చరణాంబుజ
కలతార శ్రీవేంకట గిరినివాస అనుపమోదార విహరా గంభిరా

No comments:

Post a Comment